మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “సైరా” చిత్రం సెట్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కోకాపేటలో చిరంజీవి పొలంలో ఈ సినిమా కోసం కోట సెట్ వేశారు. ఇరవై రోజులుగా ఇదే సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. గురువారం ఇక్కడ జరిగిన షూటింగ్‌లో చిరంజీవి పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సెట్ పాక్షికంగా దెబ్బతింది. తాజాగా ఈ విషయంపై రామ్ చరణ్ స్పందించారు . “దురదృష్టవశాత్తూ మా ‘సైరా నరసింహారెడ్డి’ సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కోకాపేట్‌లో వేసిన సెట్‌లో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భగవంతుడి కృప వల్ల, మా చిత్రబృందంలో ఎవరూ గాయపడలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు. మా ‘సైరా నరసింహారెడ్డి’ ఆఖరి షెడ్యూల్‌ని పూర్తి చేయాల్సి ఉంది” అని హీరో, నిర్మాత రామ్‌చరణ్ తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా శుక్రవారం చిత్రీకరణను ఆపేశారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్, జగపతిబాబు, నయనతార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
దిశ మర్డర్… వాళ్ళు నిందితులు కాదు : పోసాని సంచలన వ్యాఖ్యలు