telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

మరచిపోలేను

prema khaidi poetry corner

మత్తుగా మరచి నిద్రపోలేను …..
మనస్సు ను నిద్రపుచ్చలేను….
నీకు ఎలా చెప్పి నా బాధ వినిపించగలను….
ఏమి చేసినా నా బాధ నీకు కనపడదే….
నిను తలచుకోవటం మానలేను….
మౌనంగా మనస్సును మధించేస్తున్న…..
నను నేను మరచిపోయాను……
కనపడదే నీకు నా కళ్ళు కన్నీటి తో…
మండుతున్న నిప్పు కణికలైనా…..
వలచిన నిన్ను మరచి తలచి తలచి జీవించలేను…
కలలన్నీ కర్పూరం లా కరిగిపోయినా….
రోజు రోజుకు కాలాన్నే మరచిపోతినే…
అయినా నిను మరచిపోలేకున్నా ….
అశ్రు బిందువులు నేల రాలుతున్న…..
ప్రతి బిందువు లో నీ రూపం జారకుండా …..
దాచుకుంటూన్న నా కనురెప్పల చాటున……
కనపడదే ఈ బాధ నీకు ఎంత కాలమైనా ….
నిను వలచి తలవకుండా మనస్సును…..
నిద్రపుచ్చలేనులే ….
అనుకున్నామని అన్నీ జరగలేదు గా ……
అనుకోలేదని ఏవి ఆగలేదుగా…….
నీ జ్ఞాపకాలలో తడిసిపోయిన ……..
మనసును మత్తుగా నిద్ర పుచ్చలేను లే……
చివరికి మరణమైనా నను చేర రాదే .!
జె.పద్మావతి
ఆదోని.

Related posts