telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎమ్మెల్సీ అనంత‌బాబుకు బెయిల్ మంజూరు

*ఎమ్మెల్సీ అనంత‌బాబుకు బెయిల్ మంజూరు
*మూడు రోజుల బెయిల్ మంజూరు చేసిన రాజ‌మండ్రి కోర్టు
*రూ.25వేలు ఇద్దరు పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానం మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రాజమండ్రిలోని ఎస్సీ,ఎస్టీ కోర్ట్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నిన్న అనారోగ్యం కారణంగా అనంతబాబు తల్లి మంగారత్నం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఎల్లవరం గ్రామంలో తల్లి అంత్యక్రియలకు హాజరుకానున్నారు అనంతబాబు. రూ.25 వేలు, ఇద్దరు పూచీకత్తుపై కోర్ట్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

అయితే ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ కండిషన్స్ పెట్టింది కోర్ట్. ఈ నెల 25 మధ్యాహ్నం 2 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాలని ఆదేశించింది. స్వగ్రామం ఎల్లవరం దాటి బయటకు రాకూడదని, అనంతబాబుతో అనునిత్యం పోలీసులు వుండాలని న్యాయస్థానం సూచించింది. అలాగే కేసు విషయంపై ఎక్కడా ప్రస్తావించకూడదని కోర్ట్ ఆదేశించింది. అంత్యక్రియలకు మాత్రమే బయటకు వెళ్లాలని సూచించింది.

ఇకపోతే.. ఈ ఏడాది మే 20వ తేదీన ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్ గా పనిచేసి మానేసిన సుబ్రమణ్యం హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఎమ్మెల్సీ అనంతబాబు కారణమని పోలీసులు తేల్చారు. సుబ్రమణ్యాన్ని పద్దతి మార్చుకోవాలని మందలించే క్రమంలో చేయి చేసకోవడంతో అతను కింద పడి తలకు గాయం కావడంతో మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. అయితే ఈ కేసులో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబునుఅరెస్టైన అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు.

Related posts