telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వారిని హెచ్చరించిన ఏపీ డిప్యూటీ సీఎం…

రాజకీయంగా నన్ను ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నంలో నా కులం పై కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. నేను ఎస్ టి కొండ దోర  వర్గానికి చెందిన వ్యక్తి నేనన్న ఆమె  ఎస్ టి సర్టిఫికేట్ కారణంగా మా అక్క పశ్చిమ గోదావరి జిల్లాలో టీచర్  ఉద్యోగం కోల్పోయిందనేది  సరికాదని, మా అక్క తులసి 2008 స్పెషల్ డిఏస్సిలో టీచర్ ఉద్యోగం వచ్చింది.. అయితే జివో 3 ప్రకారం నాన్ లోకల్ కి ఉద్యోగాలు ఇవ్వకూడదనే రూల్ కారణంగా మాత్రమే ఉద్యోగం నుండి తొలగించారని ఆమె అన్నారు. 2014 లో మా కుటుంబం మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ టి సర్టిఫికేట్ నే ఇచ్చారని, అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలేదని ఆమె అన్నారు. మా తాత గారిది శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం టి డి  పారా పురం  గ్రామం. అక్కడ ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చని శ్రీవాణి పేర్కొన్నారు. జి వో 122 ప్రకారం ఎమ్మార్వో సైతం ఎస్ టి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని ఎన్నికల అధికారులు ఫిర్యాదుదారులకు తెలిపారని, విచారణ రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నా నా పై కుట్రలు చేసేవారు త్వరలో బయటపడతారని హెచ్చరించారు.

Related posts