telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నిమ్మ‌కూరు ప‌ర్య‌ట‌క ప్రాంతంగా తిర్చిదిద్దుతాం..-బాలక్రిష్ణ

*నిమ్మ‌కూరు లో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలు..
* ఎన్టీఆర్‌ అన్ని త‌రాల‌కు ఆద‌ర్శ మూర్తి..
*తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిర‌స్థాయిగా నిల‌చిపోయారు..
*రామారావు అంటే గుర్తుకి వ‌చ్చేది 2 కిలోబియ్యం
*ఎన్టీఆర్ అనే మూడు అక్ష‌రాలు వింటే త‌నువు పుల‌కిస్తుంది..
*నిమ్మ‌కూరు ప‌ర్య‌ట‌క ప్రాంతంగా తిర్చిదిద్దుతాం..

నందమూరి బాలక్రిష్ణ నిమ్మకూరులో తన తండ్రి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ప్రపంచ పటంలో తెలుగు సంతకం, ఆత్మగౌరవం నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే తనువు పులకిస్తుందన్నారు. ఆయన శత జయంతిని అందరూ స్వచ్చందంగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు

నేటి నుంచి ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు అంటే పార్వతీపరమేశ్వరులు లాంటి వారని, ఎన్టీఆర్‌ ఇల్లే ఒక నటనాలయం, ఆయన అందరి గుండెల్లో ఉన్నారన్నారు నటుడు బాలక్రిష్ణ.

ఎన్టీఆర్ పేరు వింటే రెండు రూపాయలకు కిలో బియ్యం గుర్తుకు వ‌స్తుంద‌ని అన్నారు.పేదలకు ప‌క్కా ఇళ్లు ఇచ్చారని బాలక్రిష్ణ గుర్తుచేసుకున్నారు. సామాన్య రైతుగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆపై, ప్రభుత్వం ఉద్యోగిగా, కళాకారునిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు.

స్వగ్రామం నిమ్మకూరు చెరువు వద్ద 35 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులు తీర్మానించారు. నిమ్మ‌కూరు ప‌ర్య‌ట‌క ప్రాంతంగా తిర్చిదిద్దుతామ‌ని అన్నారు. బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి ఈ విగ్రహం కడతారని బాలయ్య క్లారిటీ ఇచ్చారు.

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్ నినదించారు, సామాన్యలను సైతం చట్ట సభల్లో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతం అని బాల‌య్య గుర్తు చేసుకున్నారు..

యువకులు రాజకీయాల్లోకి రావాలి. ఉత్సాహంతో పని చేయాలని ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది. ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. ఏపీలో పరిస్థితులపై మహానాడులో మాట్లాడతానని చెప్పారు.

Related posts