telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు పర్యటన ..

*ఈ నెలాఖరున రాహుల్ గాంధీ టూర్‌
*వ‌రంగ‌ల్‌లో స‌భ పెట్టేందుకు టీపీసీసీ కార్య‌చ‌ర‌ణ‌.
*రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఏప్రిల్ 28,29 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన సాగనునుంది.

ఏప్రిల్ 28న వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఏప్రిల్ 29న హైదరాబాద్‌లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.  నిన్న పార్టీ నేతల సమావేశంలో రాహుల్ తెలంగాణ పర్యటన తేదీలను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

Related posts