telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో మరో కొత్త జిల్లా..మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు జ‌గ‌న్ ప్రభుత్వం ప్లాన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. గిరిజన ప్రాంతాలు కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ నెల 4వ తేదీన 13 జిల్లాలను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించారు. నిన్నటినుంచే కొత్త‌ జిల్లాల్లో పాలన సైతం ప్రారంభమైంది. ఏపీలో అంతకుముందు 13 జిల్లాలు ఉండగా. మరో 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య మొత్తం 26కు చేరింది.

పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కలెక్టర్లు, ఎస్పీలను సైతం నియమించింది.

ఈ క్రమంలో మంత్రి పెర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందంటూ మంత్రి పేర్ని నాని మంగళవారం పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలన్నీ కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని నాని పేర్కొన్నారు.

రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని చెప్పారు. పోలవరం జిల్లా కేంద్రంగా 27వ జిల్లా ఏర్పడుతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం రంపచోడవరం అల్లూరి సీతారామరాజు(పాడేరు) జిల్లాలో ఉన్నాయి. జిల్లా కేంద్రానికి సుమారుగా 300 కి.మీ. దూరంలో ఉండటంతో రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది. దీంతో మన్యం ప్రాంతంలో మరో జిల్లా వచ్చే పేర్ని నాని సంకేతాలు కూడా పంపించారు

 

Related posts