telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

corona

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.88 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..అయితే తాజా బులెటిన్ ప్రకారం కొత్తగా 301 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 2 మృతి చెందారు.. ఇదే సమయంలో 293 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,90,309 కు పెరగగా.. ఇప్పటి వరకు 1568 మంది కరోనాతో మృతిచెందారు.. 2,84,217 మంది రికవరీ అయ్యారు.. ఇక, కరోనా మరణాలు దేశంలో 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నాయిన.. రికవరీ రేటు దేశంలో 96.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 97.90 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,524 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 2,459 హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 34,431 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… టెస్ట్‌ల సంఖ్య 73,12,452 కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది.

Related posts