telugu navyamedia
తెలంగాణ వార్తలు

డ్ర‌గ్స్‌ కేసులో రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో సంచలనం సృష్టించిన పబ్‌-డ్రగ్స్‌ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..పబ్​లో దొరికిన వాళ్లలో మా బంధువులు ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారని.. ఎవరిమీద అనుమానం ఉంటే వారి నమూనాలు ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

కేసీఆర్‌.. నీ కొడుకును కూడా డ్రగ్స్‌ టెస్టుకు పంపుతావా అని ప్రశ్నించారు. డ్రగ్స్ అడ్డుపెట్టుకుని సినిమా రంగంపై సీఎం కేటీఆర్ పట్టు సాధించారని, డ్రగ్స్ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరగాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

పోలీసులు దాడిచేసిన సమయంలో పబ్​లో సుమారు 142 మంది చిక్కారని.. అయితే వారి నుంచి ఎటువంటి నమూనాలు సేకరించకుండా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. దీని వెనుక ఎదో కుట్ర ఉందనే అనుమానం తమకుందన్నారు.

టాస్క్​పోర్స్​ దాడుల తర్వాత పట్టుబడ్డ వారిలో ప్రముఖులు ఉండడంతో అధికారులకు మంత్రి కేటీఆర్​ ఫోన్​ చేసి చూసిచూడనట్లు వదిలేయమన్నారని రేవంత్​ రెడ్డి ఆరోపించారు.24 గంటల పాటు మద్యం సరఫరాకు ఎవరు అనుమతిచ్చారని ప్రశ్నించారు.

అసలు డ్రగ్స్​ కేసులో కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసింది తానే అని గుర్తు చేశారు. పంజాబ్​‌లో డ్రగ్స్​ బారినపడి ఎందరో యువత నిర్వీర్యం అయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసులో దర్యాప్తు బాగా జరిపించాలని అన్నారు. విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్​ చేశారు.

పంజాబ్​లో డ్రగ్స్​ బారినపడి ఎందరో యువత నిర్వీర్యం అయ్యారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే.. పారదర్శకంగా దర్యాప్తు చేయాలని.. విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్​ చేశారు.

Related posts