telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సిఎఎ తప్పే..నా కాడ కుదరనివ్వను.. : కేసీఆర్

telangana cm kcr on CAA

సిఎఎపై టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సిఎఎ దేశానికి మంచిది కాదని, వందకు వందశాతం ఇది తప్పుడు నిర్ణయమని అన్నారు. సిఎఎను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. దీనిపై వివిధ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనని, రాబోయే నెల రోజుల్లో ప్రాంతీయ పార్టీల సీఎంలతో హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ సెక్యూలర్‌ పార్టీ. మేము ఎవరికి భయపడం. ఏ పనినైనా స్పష్టతతో చేస్తాం. సీఏఏను పార్లమెంట్‌లోనే వ్యతిరేకించాం. సీఏఏ వందకు వంద శాతం తప్పుడు నిర్ణయం. దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సమానం అని రాజ్యాంగం ఉంది. అలాంటి అప్పుడు ముస్లింలను పక్కకు పెడితే అంటే ఎలా? ఇది నాకు బాధ కలిగిచింది. హోం మంత్రి ఫోన్‌ చేస్తే కూడా అదే చెప్పాను.

ఆర్టీకల్‌ 370కి సపోర్ట్‌ చేశా. అది దేశ గౌరవానికి సంబంధించింది కాబట్టి మద్దతు ఇచ్చాం. అదేవిధంగా సిఎఎ వ్యతిరేకించాం. కుండబద్దలు కొట్టినట్లు మా నిర్ణయాన్ని చెప్పాం. భారత్‌ను మోడీ హిందూ దేశంగా మార్చుతున్నారంటూ మేథావులు అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో కేంద్రం విద్వేషాలు రెచ్చగొడుతోంది. బిజెపి తీరు ఇదేనా? బైంసా ఘటన చేసింది ఈ భక్తులే.. గడబిడా అవుతుంటే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పంపి పరిస్థితి సక్కదిద్దాం..నేను హిందువునే.నేను యాగం బహిరంగంగా చేశాను. కొంత మంది తలుపులు పెట్టుకొని యాగం చేస్తారు. మతాలను రెచ్చగొట్టి ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. సీఏఏను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కొట్టిపారేయాలి. సీఏఏను వ్యతిరేకిస్తూ అవసరమైతే 10 లక్షల మందితో సభ నిర్వహిస్తాం’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Related posts