telugu navyamedia
క్రైమ్ వార్తలు

డ్రగ్స్‌ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతి అరెస్ట్‌..

హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసై బీటెక్ విద్యార్ధి మృతి చెందిన కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. ల‌క్ష్మీపతి కోసం ఐదు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు లక్ష్మీపతి ఏపీలో పోలీసులు పట్టుకున్నారు.

ఏడేళ్లుగా లక్ష్మీపతి గంజాయికి బానిసైన లక్ష్మీపతి.. బీటెక్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయికి అలవాటు పడ్డాడు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయి, డ్రగ్స్ అమ్మిన లక్ష్మీపతి.. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆశిష్ హాష్ ఆయిల్ తెచ్చి అమ్మేవాడని పోలీసులు వెల్లడించారు

లక్ష్మీపతికి హైదరాబాద్‌లో భారీ నెట్‌వర్క్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్‌గా లక్ష్మీపతి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

స్నాప్‌చాట్, టెలిగ్రామ్‌, ఇన్‌స్టా వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాం ద్వారా సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులకు వల వేస్తున్నట్లు పోలీసుల తెలిపారు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. లీటర్‌ హాష్‌ ఆయిల్‌ను రూ.6 లక్షలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

డ్రగ్స్‌ దందాలో లక్ష్మీపతి నెట్‌వర్క్‌లో 100 మందికి పైగా వినియోగదారులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో కొన్ని పబ్‌లకు లక్ష్మీపతి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

గతంలో గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అరెస్ట్ అయిన వారిలో మృతిచెందిన విద్యార్థి కూడా ఉన్నాడు.ఈ విద్యార్ధి మృతి కేసులో లక్ష్మీపతి కీలక నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

.

Related posts