telugu navyamedia
సినిమా వార్తలు

విశాల్ పై రాధారవి ఘాటు వ్యాఖ్యలు

Radha Ravi,Vishal
తమిళ సీనియర్ నటుడు రాధారవి ఇటీవల ఓ వేదికపై నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నయనతార కూడా తనదైన శైలిలో రాధారవికి కౌంటర్ ఇచ్చింది. ఆయన వ్యాఖ్యలపై పలువురు నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే తమిళ స్టార్ హీరో విశాల్ “రాధారవి గారూ .. మహిళల గురించి .. ముఖ్యంగా ఒక నటిని గురించి మీరు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఒక మహిళ వల్లనే మీరు పెరిగి పెద్దవారయ్యారనే కనీస జ్ఞానం కూడా మీకు లేదు. మహిళలంటే గౌరవం లేని మీరు .. మీ పేరులోని ‘రాధ’ను తొలగించి .. ‘రవి’ అని మాత్రమే పిలుపించుకోండి” అని ఫైర్ అవుతూ ట్వీట్ చేశారు. విశాల్ ట్వీట్ పై రాధారవి తనదైన శైలిలో స్పందించారు. “విశాల్ కి ఏమీ తెలియకపోయినా అన్ని విషయాల్లో తల దూర్చుతుంటాడు. “రా”‘ అనేది మా తండ్రిగారి పేరు. అందుకే అది నా పేరుకు ముందు వచ్చింది” అని తెలిపారు. అంతేకాదు గతంలో ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో విశాల్ నామినేషన్ తిరస్కరింపబడటాన్ని గుర్తుచేస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు రాధారవి. మరి ఆయన వ్యాఖ్యలపై విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. తమిళనాట ఈ దుమారం ఇప్పట్లో ఆగేలా లేదు.

Related posts