telugu navyamedia
సినిమా వార్తలు

అలాంటి వ్యక్తిని పెళ్ళి చేసుకోను… కాజల్ కామెంట్స్

Kajal

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. కాజ‌ల్ ఇటీవలే కోమ‌లి, రణ‌రంగం చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో “కోమలి” చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్లో ” ముంబై స‌గ” అనే చిత్రంలో జాన్ అబ్ర‌హంతో రొమాన్స్ చేయ‌నుంద‌ట‌. సంజ‌య్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నార‌ని స‌మాచారం. క ఆమె న‌టించిన‌ “పారిస్ పారిస్” కూడా విజయం సాధిస్తుందని కాజల్ ధీమాగా ఉంది. మరోవైపు కమల్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “భారతీయుడు-2″లో నటిస్తోంది. ఇదీ కాక శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జ‌త‌క‌ట్ట‌నుంది కాజ‌ల్‌. “కాల్ సెంటర్” అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. తాజాగా అభిమానులతో ట్విటర్ ఛాట్ చేసిన కాజల్ పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుందని, రామ్‌చరణ్ మంచి మనసున్న సూపర్‌స్టార్ అని అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. “నా వయసు 17 సంవత్సరాలు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?” అని ఒక వ్యక్తి కాజల్‌కు ప్రపోజ్ చేశాడు. దీనికి కాజల్ స్పందిస్తూ… “నా కంటే తక్కువ వయసున్న వ్యక్తిని పెళ్లిచేసుకోను” అని చెప్పింది. అలాగే తనకు వివాహ బంధం మీద నమ్మకముందని, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా చేసుకుంటానని కాజల్ చెప్పింది.

Related posts