telugu navyamedia
సినిమా వార్తలు

సాయి పల్లవితో ప్రేమ వార్తలు… స్పందించిన విజయ్

AL Vijay,Sai Pallavi
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోయిన్ సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. న్యాచురల్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఓ తమిళ దర్శకుడితో ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్ళి చేసుకునే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియా కొసకి కూస్తోంది. దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తో ప్రేమలో పడిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు విజయ్ స్పందించారు. “నేను, సాయిపల్లవి ప్రేమించుకుంటున్నట్టు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు వస్తున్న వార్తల్లో లేదు. ఇదంతా పనిలేనివాళ్లు చేస్తున్న ప్రచారం మాత్రమే” అంటూ చెప్పి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. 
గతంలో విజయ్ దర్శకత్వంలో సాయి పల్లవి “కణం” చిత్రంలో నటించింది. ఆ సమయం నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని అంటున్నారు. అయితే సాయి పల్లవి సన్నిహితులు మాత్రం ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు. ఇటీవలే సాయి పల్లవి కూడా ఓ ఇంటర్వ్యూలో అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని చెప్పుకొచ్చింది. మరోవైపు ఈ వార్తపై సాయి పల్లవి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో విజయ్ హీరోయిన్ అమలాపాల్ ను పెళ్ళి చేసుకుని, 2 సంవత్సరాలు కలిసి ఉన్న తరువాత విడిపోయారు.

Related posts