telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నటుడు రాజశేఖర్‌ రాజీనామాకు కు .. మా ఆమోదం..

MAA

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా), సినీ నటుడు రాజశేఖర్‌ రాజీనామాను ఆమోదించింది. ‘మా డైరీ ఆవిష్కరణ’ కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం రాజశేఖర్.. తన పదవికి రాజీనామా చేశారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్ పని చేశారు. ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రాజశేఖర్ రాజీనామాను ఆమోదించారు.

రాజశేఖర్‌పై క్రమశిక్షణ చర్యలకు చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీమోహన్, జయసుధతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్ణయం మేరకు హీరో రాజశేఖర్‌పై చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు రాజశేఖర్ రాజీనామాను ఆమోదిస్తూ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది.

Related posts