telugu navyamedia
సినిమా వార్తలు

‘పుష్ప’ – సామీ సామీ ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘పుష్ప’. డిసెంబర్‌17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ  వసూళ్లు సాధించింది.

సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో బన్నీ మాస్‌ యాక్టింగ్‌తో పాటు పాటలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి.

ఇప్పటికే చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ‘దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

New Pushpa The Rise Song 'Saami Saami'; Allu Arjun Storms The Internet  Again - Movies Updates

 జనవరి 7, శుక్ర‌వారం రాత్రి 8 గంటల నుంచి పుష్ప చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలు కానుంది.  ఈ క్రమంలోనే ‘సామీ సామీ’ పూర్తి వీడియో సాంగ్​ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ ఈ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో రష్మిక.. తనదైన స్టెప్పులతో అలరించింది.

Pushpa Sami Song: బన్నీ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పుష్ప టీమ్‌.. 'సామి సామి' వీడియో సాంగ్‌ వచ్చేసింది..

ఈ సినిమాకు చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను మౌనిక యాదవ్‌ ఫోక్‌ సింగర్‌ అద్భుతంగా ఆలపించారు.  ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషించారు.

Related posts