telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్‌ఎక్స్‌-100 భామ కారణంగా భారీ నష్టం…

ఒక్కోసారి నిర్మాతలు చేసే చిన్న చిన్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాత సి. కళ్యాణ్ విషయంలో అదే జరిగిందట. తొలి చిత్రం ‘ఆర్.ఎక్స్. 100’తో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఓవర్ నైట్ కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసింది. దాంతో ఆమె హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ఆర్డీఎక్స్ లవ్’ను సి. కళ్యాణ్ నిర్మించారు. ఎంపిక చేసుకున్న కథలో డెప్త్ ఉన్నా, భారీ ఓపెనింగ్స్ రావాలంటే కుర్రాళ్ళను ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమాలోని శృంగార సన్నివేశాలను ఒకచోట చేర్చి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో సెగలు రేపింది. అయితే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పై కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు. దాంతో నిర్మాత సి. కళ్యాణ్ దగ్గర ‘ఈ ట్రైలర్ కారణంగా తన ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతోందం’టూ పాయల్ మొరపెట్టుకుందట. ఆమె మాటను గౌరవిస్తూ, సినిమాలోని పాయల్ క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ, సెకండ్‌ ట్రైలర్ ను విడుదల చేశారు సి. కళ్యాణ్. లేడీ అమితాబ్ విజయశాంతి తరహాలో పాయల్ రాజ్ పుత్ కనిపించే ఈ ట్రైలర్ చూసిన కుర్రాళ్లు పెదవి విరిచారట. విజయశాంతి స్థాయిలో పాయల్ ను తెర మీద చూడటం ఇష్టంలేని వాళ్ళెవరూ థియేటర్లకు రాలేదు. దాంతో ఓపెనింగ్స్ కరువయ్యాయి. మంచి పాత్ర చేసినా… పాయల్ కు రావాల్సిన గుర్తింపు దక్కలేదు. తాను చేసిన చిన్న తప్పువల్ల నిర్మాతగా ఏడు కోట్ల రూపాయలు నష్టపోయానని సి. కళ్యాణ్ తెలిపారు.

 

 

Related posts