ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే తేది. కంపెనీలకు, ఉద్యోగులకు, ప్రభుత్వాలకు ఈ తేదీ నుంచే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ ఒకటి నుంచే చాలా మార్పులు, చేర్పులు చేసుకుంటాయి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన అనేక ప్రతిపాదనలు అమలులోకి వచ్చేది ఏప్రిల్ 1 నుంచే కావడం విశేషం. ఈ సారి కార్లు, బైక్‌లు, టీవీలు, ఏసీల రూపంలో సామాన్యులపై భారంపడే అవకావం కనిపిస్తోంది. విమానం ప్రయానీకులు మరింత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొత్త ఆర్థిక ఏడాది నుంచి కార్లు, బైక్‌ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. టీవీ, ఏసీలపై రూ. 3 వేల నుంచి రూ. 4వేలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తయారీ వ్యయాలు పెరగడంతో ధరలు ప్రియం కాబోతున్నాయి.
ప్యాకేజీలు తీసుకుని పవన్ చంద్రబాబుకు పనిచేస్తున్నారు: రోజా