telugu navyamedia
రాజకీయ

దేశ‌వ్యాపంగా 40 జిల్లాల మేజిస్ట్రేట్‌లతో మోడీ సమావేశం !

తక్కువ  కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజ్ మందకొడిగా ఉన్న దేశవ్యాప్తంగా 40 జిల్లాల మేజిస్ట్రేట్‌లతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పలువురు ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. నవంబర్ 3 వర్చువల్ మీటింగ్ వారి జనాభాలో 50% కంటే తక్కువ మంది కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క మొదటి షాట్ తీసుకున్న జిల్లాలపై ప్ర‌ధానంగా దృష్టి పెడుతుంది

“సిఓపి26 [గ్లాస్గో, స్కాట్లాండ్‌లో] హాజరైన తర్వాత దేశానికి తిరిగి వచ్చిన వెంటనే, ప్రధాని నరేంద్ర మోదీ తక్కువ టీకా కవరేజీ ఉన్న జిల్లాలతో నవంబర్ 3 మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారాతక్కువ టీకా కవరేజీ ఉన్న జిల్లాలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

మొదటి డోస్ 50% కంటే తక్కువ కవరేజీ మరియు రెండవ డోస్ తక్కువ కవరేజీ ఉన్న జిల్లాలను ఈ సమావేశంలో చేర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.

కోవిడ్-19 వ్యాక్సినేషన్ శాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో ఎక్కువ శాతం జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ  మరియు ఇతర రాష్ట్రాల్లోని 40 మందికి పైగా జిల్లా మేజిస్ట్రేట్‌లతో ప్రధాన మంత్రి సంభాషిస్తారు. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు.

ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా .. రాష్ట్ర ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా టీకా సంఖ్యలను పెంచడానికి “హర్ ఘర్ దస్తక్ (ఇంటింటికి ప్రచారం)” ప్రకటించారు.

కాగా… ఆదివారం జరిగిన G20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా గ్లోబల్ సప్లై చెయిన్స్ గురించిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.

Related posts