telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు

no licence renewal required to petrol and

పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణంగా ప్రతిరోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధర రూ.84.25 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.76.84 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.87.16 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర రూ.79.34 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.86.73 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.78.93 వద్ద నిలకడగా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.81.06 వద్ద నిలకడగా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.70.46 వద్ద స్థిరంగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.87.74, డీజిల్ ధర రూ.76.86 ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 1.64 శాతం తగ్గుదలతో 41.95 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 2.04 శాతం క్షీణతతో 39.83 డాలర్లకు తగ్గింది.

Related posts