telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బట్టలు కాదు టాలెంట్ ను గుర్తించండి… ప్రియాంక చోప్రా డ్రెస్ పై హీరోయిన్ కామెంట్స్

Priyanka-Chopra

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల గ్రామీ అవార్డ్స్ వేడుకలో వేసుకున్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ ఇంటర్నేషనల్ డిజైనర్స్ రాల్ఫ్ అండ్ రూసో డిజైన్ చేసిన పొడవాటి తెలుపు రంగు గౌను వేసుకున్నారు. డ్రెస్ చేప ఆకారంలో బాగానే ఉంది కానీ.. ముందు భాగంలో మాత్రం క్లీవేజ్ షో ఎక్కువైపోయింది. ఎద నుంచి పొట్ట భాగం వరకు కట్ అయివుంది. దీంతో ఆమె డ్రెస్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అయితే ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్‌పై వెండెల్ రోడ్రీగ్ అనే భారతీయ ఫ్యాషన్ డిజైనర్ కామెంట్ చేశారు. దాంతో నటి సుచిత్రా కృష్ణమూర్తి మండిపడ్డారు. ప్రియాంక చోప్రాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ‘‘నేను ప్రియాంక ఫ్యాన్‌ని కాను. కానీ ఆమె వేసుకున్న డ్రెస్ మాత్రం కిరాక్ ఉంది. పొట్ట చూపించడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. అందుకు ఆమెను చూసి పొగడాలి. మా శరీరాలను చూసి మా క్యారెక్టర్‌ను నిర్ణయించేయకండి. మా టాలెంట్‌ను గుర్తించండి’’ అని క్లాస్ పీకింది. అయితే ప్రియాంక భర్త నిక్ జొనాస్ బ్యూటిఫుల్‌గా ఉన్నావని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు.

Related posts