telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

40వేల ఏళ్లనాటి జంతు కళేబరం.. యధాతధంగా ఉందట.. !

animal body without decompose found

సాధారణంగా ఏ జీవి మరణించిన కొద్దిసేపటికే ఆ కళేబరం పాడైపోతుంటుంది.. కానీ ఇక్కడ దొరికిన ఈ జంతువు కళేబరం 40 వేల ఏళ్ళదట, చెక్కుచెదరకుండా అలాగే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.. ఫొటోలో.. సాధారణంగా దొరికిన కళేబరం ఎముకల ఆధారంగా ఆ జంతువు ఎన్నేళ్ల క్రితం చనిపోయిందో అంచనా వేస్తుంటారు. సైబీరియాలో దొరికిన ఓ కళేబరాన్ని చూస్తే ఆ జంతువు ఇటీవల మరణించి ఉంటుందని అనిపిస్తుంది.

ఈ తోడేలు 40 వేల ఏళ్ల క్రితం చనిపోయిందని పరిశోధనల్లో తేలింది. తోడేలు చనిపోయాక దాని తల భాగం మంచులో కూరుకుపోవడంతో తోలు, నాలుక, పళ్లు, మెదడు సహా తలలోని ఇతర భాగాలన్ని చెక్కు చెదరకుండా ఉన్నాయని పరిశోధనలు తెలిపాయి. మముత్‌లు నివసించిన కాలంలోనే ఈ రకం తోడేళ్లు భూమిపై ఉండేవని మముత్‌లతోపాటు ఇవి కూడా అంతరించి పోయాయని వెల్లడించారు.

Related posts