telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హైదరాబాద్‌లో దీక్షకు దిగిన పవన్‌ కళ్యాణ్‌

ఏపీని నివర్‌ తుఫాన్‌ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.. దీంతో తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులను ఇటీవలే జనసేనాని పవన్‌ పరామర్శించారు. చేతికి అంది వచ్చే సమయంలో పంట వరదలో మునగడంపై పవన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను పరామర్శించిన సమయంలో… వారికి పరిహారం చెల్లించాలని పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ కూడా చేశారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం దిగిరాలేదు. దీంతో తాజాగా.. నివర్‌ తుఫాన్‌ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ పవన్‌ కళ్యాణ్‌ దీక్షకు దిగారు. హైదరాబాద్‌ లోని తన నివాసం దగ్గరే ఆయన దీక్షలో కూర్చున్నారు. తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ దీక్ష ఇవాళ సాయంత్రం వరకు కొనసాగనుంది. అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ జనసేనాని ఇచ్చిన పిలుపు మేరకు జనసేన, బీజేపీ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు.

Related posts