telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాల స్వాధీనం ఏంటి?..

ఒంగోలులో సీఎం జగన్ కాన్వాయ్ కోసం తిరుపతి వెళ్తున్న యాత్రికుల కారును స్వాధీనం చేసుకోవడం ఏంటి? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.ఎవరి ఒత్తిడితో ప్రయాణికుల కారును తీసుకున్నారో స్పష్టతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు

గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ,,సీఎం పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితొచ్చిందా? అని నిలదీశారు. ప్రయాణికుల కారును పోలీసులు లాక్కోవడం దుర్మార్గమన్నారు.

లక్షల కోట్ల బడ్జెట్, అప్పులు కలిగిన ఏపీ ప్రభుత్వం.. సొంతంగా వాహనాలు సమకూర్చుకోలేదా? అని ఎద్దేవా చేశారు. సహాయ అధికారిని, హోంగార్డును సస్పెండ్ చేసేసి.. ఘటనను మరుగునపడేద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లుందని మండిపడ్డారు.

ట్రావెల్ ఆపరేటర్స్ నుంచి అద్దెకు తీసుకోకుండా ప్రయాణికులను నడిరోడ్డుపై వదిలి వాహనాన్ని తీసుకోవాల్సిన ఒత్తిడి వారిపై ఎందుకుంది..? ఈ పరిస్థితి ఆ ఉద్యోగులకు ఎందుకు కలిగిందో విచారించాలన్నారు. సదరు ఉద్యోగులపై ఆ స్థాయి ఒత్తిడిని రాజకీయ నాయకులు తెచ్చారా? ఉన్నతాధికారులు తెచ్చారా..? అనేది ముఖ్య‌మ‌ని ప‌వ‌న్ అన్నారు.

ఈ ఘటనపై ప్రజలకు ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.  

Related posts