telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

కాకినాడ .. ఎంపీ బరిలో .. నాగబాబు.. ! పవన్ వ్యూహం ఏమిటి.. ?

nagababu from kakinada as mp candidate

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి కుటుంబానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే కుటుంబీకులు ఒకొక్కరు పవన్ కు మద్దతు పలకడం, ఇక అన్న నాగబాబు అయితే ఏకంగా ప్రచార బాధ్యతలు కూడా తీసుకున్నాడు. దీనితో పవన్ అన్న నాగబాబును వచ్చే ఎన్నికలలో బరిలోకి దించాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలోనే కాకినాడలో జనసేన నిర్వహించిన సర్వేలో అనుకూలత కనిపించడంతో, అక్కడి నుండే నాగబాబును ఎంపీ గా బరిలోకి దించాలని పవన్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. అధికారికంగా ఇది ఇంకా బయటకు విడుదల కాకపోయినా, ఇటీవల జరిగిన అనేక ఘటనలు ఇది నిజం కాబోతున్నాడన్నదానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. దానిలో భాగంగానే నాగబాబు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి, జనసేన పార్టీని విమర్శించిన వారిని ఏకిపారేస్తున్నాడు. నాగబాబు బరిలో దిగితే ఎమ్మెల్యేలకు మేలు జరుగుతుందని పవన్ ఆలోచనగా తెలుస్తుంది.

మొత్తానికి జనసేన తరుపున నాగబాబు పోటీలో దిగితే, పరోక్షంగా మెగా కుటుంబం అంతా కూడా జనసేనకు మద్దతు ప్రకటించినట్టే అవుతుంది. ఒక్కసారి చిరంజీవి కూడా జనసేన అధినేతతో ఏదైనా ప్రచార సభలో కనిపిస్తే.. ఆ కిక్కే వేరప్పా.. ! అదికూడా త్వరలో జరగనుందేమో..!

Related posts