telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో 309 కోట్లతో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు…

ఆక్సిజన్ ఉత్పత్తి కోసం భారీగా నిధులు కేటాయిస్తోంది ఏపీ ప్రభుత్వం.  రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం ఏకంగా రూ.309.87 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.  రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  దీంతో పాటుగా 50 క్రయోజనిక్  ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  10వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఇక ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహిణ కోసం ప్రతి జిల్లాకు రాబోయే ఆరు నెలలకు రూ.60 లక్షల రూపాయలను మంజూరు చేసింది.  రాష్ట్రంలో కరోనా రోగులకు వైద్యం, ఆక్సిజన్ సరఫరా కోసం ఏపి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts