ఏపీ మంత్రి ఆర్.కె. రోజా ఫోన్ చోరీకి గురైంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చిన ఆమె.. ఇవాళ తిరుపతిలో పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో రాష్ట్ర స్థాయి శాప్ అధికారులతో మంత్రి హోదాలో ఆర్.కే.రోజా శాప్ తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సమీక్షా సమావేశం కావడంతో ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగంలో ఉన్న జ్ఞానప్రద శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో రోజా ఫోన్ చోరీకి గురైంది.
ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు ట్రాకింగ్ ద్వారా మంత్రి ఫోన్ ఆచూకీ కోసం మూడు బృందాల ద్వారా గాలింపు చేపట్టారు. పద్మావతి గెస్ట్‌హౌజ్, ఎస్వీ వర్సిటీలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు.
పద్మావతి గెస్ట్ హౌస్‌లో రోజా సెల్ ఫోన్‌ను కొట్టేసిన సదరు వ్యక్తి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లినట్టుగా గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. అతడి నుంచి రోజా సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా అతడు కాంట్రాక్టు ఉద్యోగి అని తేలింది .అనంతరం ఫోన్‌ను మంత్రి రోజాకి అప్పగించారు.
ఇద్దరు సీఎం లు మాట్లాడింది బ్రాండ్ల గురించే!:పంచుమర్తి అనురాధ