telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పవన్ తో మాకు సంబంధం లేదు..

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప‌వ‌ర్‌స్టార్‌, జనసేన అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపైనా, మంత్రుల‌పై చేసిన ఘాటు వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వంతో సయోధ్యగా ఉండాల్సిన చిత్ర పరిశ్రమ అనవసరంగా అనవసర ఇబ్బందులు తలెత్తవచ్చంటూ ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు.

ఈ క్రమంలో మచీలిపట్నంలో వైకాపా ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్‌ సినీ నిర్మాతల భేటీ జ‌రిగింది. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు నిర్మాతలు మంత్రిని కలిసినట్టు చెప్తున్నారు. దీనిపై పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‎పై మ‌రోసారి విరుచుకుపడ్డారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్ చేయడానికి టాలీవుడ్ నిర్మాతల భేటీ | tollywood producers meet perni nani once again

పవన్‌ అభిప్రాయలకు తాము అనుకూలంగా లేమని, పవన్‌ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేసినట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నాడు. కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పటి వరకు థియేటర్లో ఉన్న 50 శాతం ఆక్యూపెన్సీని 100 శాతం పెంచాల్సిందిగా కోరినట్లు చెప్పారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్న సమయంలో ఒక సినీ నటుడి వల్ల దురదృష్ట కర పరిణామాలు తలెత్తాయి.

ఆన్‎లైన్ టికెట్ బుకింగ్ ఎప్పటి నుంచో ఉంది. ఇది ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. సినీ పరిశ్రమ ఆన్‎లైన్ టికెట్ బుకింగ్‎కు అనుకూలంగా ఉందని చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఏకాభిప్రాయంగా తీసుకోబోమని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్‌కు వాళ్ల అమ్మగారు సంస్కారం నేర్పలేదా?. ఆ సన్నాసి నన్నేం తిట్టాడు … నేను ఏం మాట్లాడాను. నేను బూతులు తిట్టలేదు.రాష్ట్ర ముఖ్యమంత్రిని అరేయ్..ఉరేయ్ అని పిలవమని అంజనాదేవి నేర్పించారా. నేను రెడ్లకు పాలేరునైతే … పవన్ కమ్మవాళ్లకు పాలేరు. నేను జగన్ దగ్గర పాలేరునే… పవన్‌కు చెప్పే దమ్ముందా. నన్ను అవమానించాలని చూస్తే ఆ అవమానాన్ని పరిచయం చేస్తా.దేశంలో కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్. రాజకీయ పార్టీని టెంట్‎హౌస్‎లా అద్దెకు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఆడియో ఫంక్షన్‎లో జరిగిన దానిపై మెగాస్టార్ చిరంజీవి తనతో ఫోన్‌లో మాట్లాడారని నాని చెప్పారు. ఆడియో ఫక్షన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆడియో ఫక్షన్‎లో జరిగిన దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి చెప్పినట్లు మంత్రి వివరించారు. చిరు మాటాలతో తాను ఏకీభవించినట్లు చెప్పారు.

కాగా..కాగా మంత్రితో జరిగిన ఈ సమావేశంలో నిర్మాత దిల్‌ రాజు, బన్ని వాసు, సునీల్‌ నారంగ్‌, వంశీ రెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

.

Related posts