telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విశాఖ పోలింగ్ కేంద్రాల్లో 4,500 మందితో బందోబస్తు…

AP Local Body Elections 2020 Reservation List Finalaized

ఏపీలో ప్రస్తుతం పంచాయితీ ఎన్నికల పై రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే విశాఖ రేంజ్ పరిధిలో తొలి విడత 582 పంచాయతీ లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ కేంద్రాల్లో 4,500 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము అని డిఐజి ఎల్.కే.వి రంగారావు తెలిపారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. 144 అతి సమస్యాత్మక ప్రాంతాలు 206 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాము అన్నారు. ప్రజలు స్వేఛ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి ప్రజలు శాంతి సామరస్యాలతో మెలగాలి. ఈ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడితే చట్టపరిధిలో చర్యలు తప్పవు…ఎవ్వరూ అతీతులుకారు. ఇప్పటికే మా రేంజ్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. ఒకరు ఒక కంటెస్టింగ్ అభ్యర్ధి బంధువుద్వారా బెదిరిస్తే… మరొకరు కంటెస్టింగ్ అభ్యర్ధిని తానే బెదిరించారు. ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశాము…ఒకరిని రిమాండ్ కు తరలించాము..మరొకరికి స్టేషన్ బెయిల్ ఇచ్చాము..  ఎవ్వరూకూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు… ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి అని డిఐజి పేర్కొన్నారు. చూడాలి మరి ఎన్నికల్లో ఏం జరుగుతది అనేది.

Related posts