వైసీపీ ప్రభుత్వం వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ వేధింపులు విపరీతంగా పెరిగాయని అన్నారు. తననుంచి కార్యకర్తలను దూరం చేయాలన్న తలంపుతో పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. తనకు నోటీసులు కూడా ఇచ్చారన్నారు. తనను కలిస్తే.. కేసులు పెడతామని హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పారు.
మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. కొంతమంది పోలీసు అధికారులు లాలూచీ పడి, పోస్టింగ్‌ల కోసం ఇలా చేస్తున్నారు. చింతమనేనిపై పలు అక్రమ కేసులు పెట్టారన్నారు. సాక్షాత్తూ ఒక ఎస్పీ కేసులు పెట్టమని ప్రోత్సహిస్తే, శాంతి భద్రతలు ఎవరు పరిరక్షిస్తారు? నా భద్రతను సాకుగా చూపిస్తూ.. ఇతర కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఆశా వర్కర్లను పరామర్శించిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పైనా కేసు పెట్టారని పేర్కొన్నారు.
ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయి: కేఏ పాల్