telugu navyamedia
సినిమా వార్తలు

పోసాని రాసలీల‌లు బయటపెట్టిన సినీ నిర్మాత..

సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన‌ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ లో ప‌వ‌ర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ చేసిన‌ వ్యాఖ్యలు సినీ ప‌రిశ్ర‌మ‌ను అత‌లాకుత‌లం చేస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన విమర్శలకు ..పోసాని కృష్ణ మురళితో సినిమా చేసిన నిర్మాత నల్లం శ్రీనివాస్ రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చారు.

పోసానికి ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, మంచి సినిమా తీస్తానని చెప్పి నన్ను మోసం చేశాడని.. అలాంటి పోసాని పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి లేదని.. ఇంకోసారి పిచ్చి మాటలను మాట్లాడితే పోసాని రాసలీలలన్నీ బయటపెడతానని తాజాగా ఓ వీడియో ద్వారా మీడియా ముందుకొచ్చి పోసానిపై నిర్మాత నల్లం శ్రీనివాస్ అస‌భ్య ప‌ద‌జాలంతో విమర్శలు చేశారు.

‘పోసాని నువ్వా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది. నాలాంటి కొత్త నిర్మాతలైన ఎంతమందిని నువ్వు చీట్ చేసి డబ్బులు దొబ్బావో చెప్పమంటావా ? పోసాని జెంటిల్మెన్ సినిమా షూటింగ్ సమయంలో నువ్వు ఎంతమంది అమ్మాయిలతో రాసలీలలు చేశావో బయటపెట్టమంటావా..? నా కళ్ళముందే నువ్వు అన్యాయాలకు పాల్పడ్డావ్.. నువ్వు చేస్తే సంసారం ఎదుటోళ్లు చేస్తే వ్యభిచారమా.. ఏమి తెలియని సమయంలో నీ దెగ్గరికి వచ్చిన నానుండి నువ్వు ఎంత డబ్బు దొబ్బినావో లెక్కలు చెప్పాలా.. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని నాసిరకమైన సినిమాను తీసి, డబ్బులు మిగిల్చుకోలేదా.. అలాంటి నువ్వు పవన్ కళ్యణ్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి ప్రశ్నిస్తావా.. ఆయన సంపాదించే ప్రతి పైసాకి టాక్స్ కడుతున్నాడు.

మరి నీ లెక్కలు ఏంటి.. దమ్ముంటే నాతో డిబేట్ కి రా.. నీ గురించి అన్ని విషయాలు ఆధారాలతో సహా బయటపెడతా’ అంటూ పోసాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నిర్మాత నల్లం శ్రీనివాస్. దీంతో ఈయన కామెంట్స్ ని తెగ వైరల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. తాజాగా పోసాని పై వస్తున్న విమర్శలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

Related posts