telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 30(బుధవారం) రాశి ఫలాలు

మేషం: ఆదాయం పరవాలేదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు అదుపు చేయాలి. సంతానం నుంచి శుభవార్త లు వింటారు. పాత మిత్రులను కలుసుకుంటారు.

వృషభం: ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది.

మిథునం: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వృత్తి, వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారం ఉంటుంది.

కర్కాటకం: ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. శుభవార్తలు వింటారు. విలువైననవస్తువులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం. ఎవరికీ హామీలు ఉండొద్దు.

సింహం: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగంలో మార్పులకు అవకాశం. ఆలస్యమైనా చేపట్టిన పనులు పూర్తవుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సమస్య పరిష్కారమవుతుంది.

కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. శుభవార్త వింటారు. వివాదాలకు దూరంగా ఉండండి.

తుల: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి విషయంలో వివాదాలకు అవకాశం. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. వివాహ సంబంధాలకు అనుకూలం. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.

ధనుస్సు: పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆదాయం పరవాలేదు. ఖర్చులు తగ్గించుకోండి. తల పెట్టిన పనులు శ్రమ మీద పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృతి, ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

మకరం: ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.వివాహ ప్రయత్నాల ఫలిస్తాయి. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త. మీ పనితీరుతో అధికారుల మనసు గెలుస్తారు.

కుంభం: ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. ఆరోగ్యం జాగ్రత్త.

మీనం: ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కడా ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. చెడు స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్లవద్దు. వృతి, ఉద్యోగులకు అనుకూలం.

Related posts