*నటి జీవిత రాజశేఖర్‌లపై చెక్ బౌన్స్ కేసు నడుస్తోంది..
*నగిరి కోర్టు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ..
*26కోట్లు ఎగవేశారని ఆరోపణలు..
*త్వరలో రాజశేఖర్ జైలుకు వెళతాడు..-డైరెక్టర్ కోటేశ్వర్
నటి జీవితా రాజశేఖర్‌కు నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జ్యోస్టర్ ఎండీ హేమ, జీవితపై ఫిర్యాదు చేశారు. తమకు రావలసిన రూ. 26 కోట్లు రూపాయలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు వెల్లడించారు.
గరుడ వేగ సినిమా కోసం జీవితా రాజశేఖర్‌లు అప్పు అడిగితే జోష్టర్ ఫిలిం సర్వీసెస్ తమ ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బు సర్దుబాటు చేసింది. ఆ ఆస్తులను బినామీల పేర్ల మీదకు మార్చుకుని జీవితా రాజశేఖర్‌లు మోసం చేసినట్లు జోష్టర్ ఎండీ ఆరోపించారు.
జీవితా రాజశేఖర్‌లపై చెక్ బౌన్స్ కేసు నడుస్తోంది. ఈ కేసులో నగరి కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. త్వరలోనే రాజశేఖర్ జైలుకు వెళతారంటూ ఆ సంస్థ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు పేర్కొన్నారు