విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్నా,మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
2019 లో సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సాధించిన ‘ఎఫ్2’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘నీ కోర మీసం చూస్తుంటే…నువ్వట్టా తిప్పేస్తుంటే… ఊ ఆ అహా అహా! నీ మ్యాన్లీ లుక్కేచూస్తుంటే… మూన్ వాక్ చేసే నా హార్టే’ ‘ఊ ఆ అహా అహా!’ అంటూ సాగింది. ఈ రొమాంటిక్‌గా సాంగ్‌ను వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ జంటలపై చిత్రీకరించారు.
ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. సునిధి చౌహాన్, లవితా లోబో, సాగర్, ఎస్పీ అభిషేక్ కలిసి పాడారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, సునీల్ ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది.