పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. ఈ సినిమా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లలో వత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. రాధేశ్యామ్’ మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో.. ప్రమోషన్స్ స్పీడ్‌ని కూడా పెంచేశారు. ఇందులో భాగంలో తాజాగా రిలీజ్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
‘సగా ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో ఈ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే.. ‘రాధేశ్యామ్’ కోసం మేకర్స్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. సినిమాని ఎంత బాగా చిత్రీకరించారో వీడియో చూస్తే తెలిసిపోతుంది. యూరప్‌లోని అందమైన లొకేషన్స్, మంచు ప్రాంతాలతో చాలా కష్టపడి సినిమా షూటింగ్ జరిపారు.
ఈ వీడియోలో మేకర్స్ 1970 కాలం నాటి ఇటలీని పున సృష్టించిన తీరు అద్భుతంగా ఉంది.కరోనా కారణంగా యూరప్‌లో షూటింగ్ ఆగిపోవడంతో.. ఇండియాలో యూరప్ సెట్ వేసి మరీ షూటింగ్ చేశారు. ఇటాలీ సెట్, సినిమాకి మ్యూజిక్ అందివ్వడం.. ఇలా అన్ని వీడియోలో చూపించారు. ఈ మేకింగ్ వీడియో చూస్తే సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
కచ్చితంగా ప్రేక్షకులను మరో కొత్త లోకాలకు తీసుకెళుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది.
.
టిక్కెట్ రేట్లపై ప్రభుత్వానికి చెప్పాల్సింది చెప్పా..ఇకపై