telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తొలిసారి కమర్షియల్ యాడ్‌లో రామ్

Ram-Pothineni

టాలీవుడ్ రామ్ పోతినేని కెరీర్లో తొలిసారి కమర్షియల్ యాడ్‌లో నటించాడు. బాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ అబ్రహంతో కలిసి గార్నియర్‌ మేన్‌ షాంపు యాడ్‌లో నటించిన రామ్… ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తూ ఆ వీడియోను ట్వీట్ చేశారు. ఇందులో రామ్ హిందీలో తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఇప్పుడు రామ్ యాడ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ చాక్లెట్ బోయ్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ పోతినేని. ‘దేవదాస్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు రామ్ పోతినేని. బడా నిర్మాత, స్రవంతి మూవీస్ అధినేత రవికిషోర్ తమ్ముడి కుమారుడు రామ్. మధ్యలో కొన్ని సినిమాలు ప్లాప్ కావడంతో అతడి కెరీర్‌ సంధిగ్ధంలో పడింది. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్‌బస్టర్‌ హిట్ సాధించి అతడికి మరింత ఉత్సాహాన్నిచ్చింది.

Related posts