telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

న్యూ ఇయర్ స‌్పెషల్ : “విజయరాఘవన్” టీజర్

హీరో విజయ్ యాంటొనీ కొత్తగా చేస్తున్న సినిమా విజయ రాఘవన్ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్‌ ఇవాళ విడుదల చేసింది. ఈ సినిమా టీజర్‌ను నూతన సంవత్సర కానుకగా నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఇవాళ మధ్యాహ్నం 2గంటల 1నిమిషానికి విడుదల చేశారు. అయితే.. ఈ టీజర్ రిలీజ్‌ సందర్భంగా హీరో విజయ ఆంటోని ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. “విజయరాఘవన్ టీజర్.. మీ కోసం.. ఇది మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను… చూసి మీ ప్రోత్సాహాన్ని షేర్, కామెంట్, లైక్ రూపంలో తెలియజేయండి..మీ ప్రోత్సాహమే…నాకు బలం…2021 సమ్మర్ లో మూవీ రిలీజ్ కానుంది. ” అంటూ హీరో విజయ ఆంటోని ట్వీట్‌ చేశాడు.

Related posts