telugu navyamedia
సినిమా వార్తలు

చెల్లితో పెళ్లేంటి ?… మెగా హీరో ఫైర్

Sai-Dharam-Tej

మెగాహీరో సాయి తేజ్ ”చిత్రలహరి”తో హిట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా సాయి తేజ్ ఇంటర్వ్యూలో పాల్గొంటూ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి కూడా సాయి తేజ్ స్పందించాడు. తన తల్లి రెండో పెళ్లిపై కూడా ఓపెన్ గా మాట్లాడాడు. తాజాగా తన పెళ్లిపై వస్తోన్న రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా మెగాడాటర్ నీహారికతో సాయి తేజ్ పెళ్లి అంటూ వస్తోన్న వార్తలపై ఈ మెగా హీరో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తన పెళ్లి గురించి ఏమీ ఆలోచించడం లేదని స్పష్టం చేశారు.

ముఖ్యంగా నీహారికతో పెళ్లి అంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని, చిన్నప్పటి నుండి తను, నీహారిక బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నామని చెప్పుకొచ్చాడు. వారిద్దరి మధ్య పెళ్లి అనే ఆలోచన ఎప్పుడూ రాలేదని అన్నారు. అయినా చెల్లిని పెళ్లి చేసుకోవడమేంటి..? ఛీఛీ ఇది చాలా వరస్ట్ అంటూ మండిపడ్డారు. ఇలాంటి వార్తలు రాయడానికి సిగ్గుండాలి అంటూ కొన్ని మీడియా ఛానెల్స్ పై ఫైర్ అయ్యారు. తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, నీహారిక తనకు చెల్లితో సమానమని చెప్పుకొచ్చారు.

Related posts