telugu navyamedia
సినిమా వార్తలు

సినిమా ఇండస్ట్రీ పెద్ద అని పించుకోవ‌డం పెద్ద ఇబ్బంది..

తెలుగు సినిమా పరిశ్రమకు తాను పెద్దగా ఉండలేనని మెగాస్టార్ చిరంజీవి చేతులెత్తేశారు. ఇండస్ట్రీ “పెద్దగా ఉండను.. ఉండలేను..ఆ హోదా అవసరం లేదనీ, బాధ్యతగల వ్యక్తిగా ఏదైన సమస్య వచ్చినపుడు ముందుంటామన్నారు.

ఆదివారం ఉదయం హైదరాబాద్​లో జూబ్లీహిల్స్​లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినీ పరిశ్రమలోని సినీ కార్మికులకు హెల్త్‌ కార్డుల పంపిణీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో సినీ కార్మికులు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్​ల్లో పాల్గొనాలని సూచించారు.

తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరూ లేరు.. ఆ బాధ్యత చిరంజీవి తీసుకోవాలని కొందరు సినీ కార్మికులు కోరారు. వెంటనే స్పందించిన చిరంజీవి పెద్ద‌రికం అనేది హోదాగా అనిపించ‌కోవ‌డం తనకు స‌సేమీరా ఇష్టం లేదని ముక్కుసూటిగా తేల్చి చెప్పేశారు. పెద్ద‌గా ఉండ‌ను, పదవి వద్దని… బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాన‌ని మాట ఇచ్చారు. ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు నేనున్నాన‌ని తప్పకుండా ముందుంటామన్నారు.

అనవసర విషయాల్లో పంచాయితీ చేయలేనన్నారు. రెండు సంఘాల మధ్య పంచాయితీకి, ఇద్దరు వ్యక్తలమధ్య వ్యవహారాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకొచ్చేది లేదన్నారు. కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా బాధ్యతగా పరిష్కరించేందుకు సహకరిస్తామన్నారు.

Related posts