సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్‌బీడ్’ అనేది ట్యాగ్ లైన్. విజయ్ దేవరకొండకు జతగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విజయ్ ఈ సినిమాలో ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు.
బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్‌జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో.. అత్యున్నత సాంకేతిక విలువలతో పూరీ తెరకెక్కిస్తోన్నారు.
ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. గోవాలో ‘లైగర్’ షూటింగ్ స్పాట్‌లో ఉన్న విజయ్ దేవరకొండ ఫొటోని విడుదల చేసింది.. చిత్రయూనిట్ ఓ స్టిల్‌ను విడుదల చేసింది. ఇందులో విజయ్ జుత్తుతో షర్ట్‌లేకుండా బాక్సింగ్ రింగ్‌లో కూర్చొని ఉన్నాడు. ఇది ఫైట్ సీన్‌కు సంబంధించినదిగా ఫోటో అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇక వైరల్ అవుతోంది. బ్లడ్..స్వెట్… వైలెన్స్ అంటూ ఈ ఫొటోకి విజయ్ క్యాప్షన్ ఇచ్చాడు.
అమలాపాల్ మాజీ భర్తతో విడిపోవడానికి కారణం అది కాదట…!