telugu navyamedia
సినిమా వార్తలు

అంచ‌నాలు పెంచుతున్న పుష్ప మూవీ మేకింగ్ వీడియో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా , రష్మిక మందన్నహీరోయిన్‌గా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప. శేషాచలం అడవుల నేపథ్యంగా తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్‌గా లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నాడు.

The Promo Of 'Saami Saami' Song From Allu Arjun's Pushpa Movie Is Out

ఈ సినిమాను క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో సినిమా ప్రమోషన్స్‌ వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్‌. అందులో భాగంగా తాజగా “పుష్ప” ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

Allu Arjun reveals the release date of Pushpa song on DSP's birthday | Entertainment News,The Indian Express

ఈ వీడియోలో మనం ఈ లొకేషన్ ను ఖాళీ చేసి వెళ్ళేలోపు.. ఇక్కడున్న ప్లాస్టిక్ సామాను, చెత్త చెదారం అంతా క్లీన్ చేసి నీట్ గా ఉంచాలని మేకింగ్ వీడియోలో బన్నీ ‘పుష్ప’ టీమ్ కు సూచించడం కనిపిస్తుంది. ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించింది.

Related posts