telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డైరెక్టర్ ఎన్‌.శంకర్‌కు భూ కేటాయింపుపై హైకోర్టులో విచారణ

TSHC

టాలీవుడ్ దర్శకుడు ఎన్.శంకర్ హైదరాబాదులో సినీ స్టూడియో నిర్మాణం కోసం భూమిని కేటాయించాలంటూ గతంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. దాంతో తెలంగాణ సర్కారు ఆయనకు రంగారెడ్డి జిల్లా మోకిల్లలో 5 ఎకరాల భూమిని కేటాయించింది. ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించింది. అయితే ఈ భూమి కోట్ల విలువ చేస్తుందని, అలాంటప్పుడు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున దర్శకుడికి ఏ విధంగా కేటాయిస్తారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. రూ.2.5 కోట్ల విలువైన భూమిని ఇంత తక్కువ ధరకు ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడానికి తగిన ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని అడిగింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఏజీ క్వారంటైన్ లో ఉన్నారని, తమకు కొంత గడువు కావాలని కోరారు. ఈ విజ్ఞప్తిని మన్నించిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

Related posts