telugu navyamedia
సామాజిక

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైంది వీరే..

ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ముగ్గురిని ఎంపిక చేశారు. అమెరికాకు చెందిన సైంటిస్టులు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డి. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది. అయితే ఇందులో సగం పురస్కారాన్ని డేవిడ్‌ కార్డ్‌కు ఇవ్వగా.. మిగతా సగాన్ని జాషువా, గైడో పంచుకోనున్నారు.

కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశోధనాత్మక సహకారం అందించినందుకు గానూ డేవిడ్‌ కార్డ్‌కు నోబెల్ అందిస్తున్నట్లు అకాడమీ వెల్లడించింది. డేవిడ్ కార్డ్… అమెరికాలోని బెర్క్ లే లో ఉన్న కాలిఫోర్నియా వ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్ గా ఉన్నారు. ఈయన కార్మిక ఆర్థిక వ్య‌వ‌స్థ గురించి విలువైన సూచ‌న‌లు చేశారు.

ఇక ఆర్థికశాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు కూడా పురస్కారం ఇస్తున్నట్లు అకాడమీ తెలిపింది.

ఇమ్మిగ్రేష‌న్ విధానం జీతంపై ప్ర‌భావం చూపుతుందా.. ఉద్యోగంలో మార్పు తెస్తుందా.. లాంటి అంశాల‌ను స్ట‌డీ చేశారు. పెద్ద చ‌దువులు చదివితే భ‌విష్య‌త్తులో ఆదాయం ఎలా ఉంటుంది.. నిజానికి ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పడం అంత ఈజీ కాదు. అయితే ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు ఈ ముగ్గురు సైంటిస్టులు స‌హ‌జ‌మైన రీతిలో స‌మాధానం ఇచ్చే ప్రయత్నమే వారికి నోబెల్ పురస్కారాలను తెచ్చిపెట్టింది.

 

Related posts