telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దాం: కేసీఆర్ పిలుపు

telangana cm kcr on CAA

జనతా కర్ఫ్యూని 24 గంటలు పాటించి దేశానికే ఆదర్శంగా నిలుద్దామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రేపటి జనతా కర్ఫ్యూ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 21 కరోనా కేసులు నమోదయ్యాయని, వారందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని వెల్లడించారు.

పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా అనుమానితులపై నిఘా కోసం తెలంగాణ చుట్టూ 52 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటివరకు 11 వేల మంది అనుమానితులను గుర్తించి వారిని పరిశీలిస్తున్నామని, అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలు సరిగా తెలియడంలేదని అన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వీయ నియంత్రణ అవసరమని స్పష్టం చేశారు. అలా ముందుకు వచ్చినవారికోసం అంబులెన్స్ నుంచి మాత్రల వరకు ప్రభుత్వమే అన్నీ భరిస్తుందని హామీ ఇచ్చారు.వైరస్ తీవ్రత కారణంగా తాము మీడియా సమావేశంలో విలేకరులను కూడా మూడు మీటర్ల ఎడంతో కూర్చోబెట్టామని, అందరి క్షేమం దృష్ట్యా ఇలాంటి చర్యలు తప్పడంలేదని వివరించారు..

Related posts