telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

ముందుగానే .. నైరుతి రుతుపవనాలు ..

monsoon on june first week only

రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలను ఇవి పలకరించాయి. నిజానికి ప్రతి ఏడాది మే 20న నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకుతుంటాయి.

ఈసారి మాత్రం రెండు రోజుల ముందుగానే అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. మరో మూడునాలుగు రోజుల్లో ఇవి దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌ సముద్రం, అండమాన్‌ దీవుల్లోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Related posts