telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గోప్యంగా మెగా ప్రిన్సెస్ నిహారిక నిశ్చితార్థం

Niharika

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారికకు మెగాస్టార్ అభిమానులే కాకుండా ప్రత్యేకమైన అభిమానులున్నారు. టీవీ షోలలో తనదైన ముద్రతో ఒక ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు నిహారిక. తాజాగా మెగా ఫ్యామిలీలో పెళ్ళి సందడి మొదలైంది. ఇప్పుడు నీహారిక పెళ్లి కూతురయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.. గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు చైత‌న్య జొన్నల‌గ‌డ్డతో నిహారిక వివాహం జరగనుంది. ఇప్పటికే తన ప్రియుడిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది నిహారిక.. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నిన్న నీహారిక వివాహ నిశ్చితార్థం చాలా కొద్దీ మంది కుటుంబ అతిథుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ ఇంకా అతికొద్ది మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కోవిద్ నిబంధనల నేపథ్యంలో చాలా గోప్యంగా ఈ వేడుకను నిర్వహించారు. గతంలోనే నాగబాబు నిహారిక పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చారు. పెళ్లి ఫిబ్రవరిలో ఉండొచ్చని అయన చెప్పారు.

Related posts