telugu navyamedia
క్రీడలు వార్తలు

ఫుల్​బాల్ హిస్టరీలోనే లాంగెస్ట్ గోల్…

ఫుల్​బాల్ చరిత్రలో అద్భుతం జరిగింది. హిస్టరీలో లాంగెస్ట్ గోల్ నమోదైంది. న్యూపోర్ట్ గో​ల్ కీపర్​ టామ్ కింగ్ ఈ గోల్ బాదాడు. కింగ్ కొట్టిన బంతి ఏకంగా 96.01 మీటర్లు ప్రయాణించి అవతలి గోల్ పోస్ట్​లో పడింది. ప్రపంచ రికార్డును టామ్ బద్దలుకొట్టాడని గిన్నిస్ బుక్ రికార్డ్స్ వెబ్​సైట్ ప్రకటించింది. “చరిత్రాత్మక కిక్​తో అధికారికంగా లాంగెస్ట్ గోల్ రికార్డును కింగ్ బద్దలుకొట్టాడు. ఇది ఏకంగా 96.01 మీటర్లు (ప్రయాణించి గోల్​గా నమోదైంది” అని వెల్లడించింది. “నేను నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నా. ఎందుకంటే నేను గోల్​కొట్టాలన్న ఉద్దేశంతోనే బంతిని బాదా. ఈ రికార్డు అధిగమించాలంటే చాలా కాలం పడుతుందని అనుకుంటున్నా. నేను చాలా గర్వంగా ఫీలవుతున్నా. నాకు కుటుంబం కూడా ఎంతో సంతోషిస్తోంది. ఈ అనుభూతి చాలా కొత్తగా ఉంది. గిన్నీస్ బుక్​లో చోటు దక్కించుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. నా రికార్డును ఎవరూ బద్దలుకొట్టరని, నా మనవళ్లకు కూడా ఈ అద్భుతాన్ని చూపించాలని కోరుకుంటున్నా” అని టామ్ కింగ్ చెప్పాడు. కాగా ప్రొఫెషనల్​గా కింగ్​కు ఇది తొలి గోల్ కావడం విశేషం. అయినా తన ప్రత్యర్థి జట్టు చెల్తెన్​హామ్​ను గౌరవిస్తూ అతడు ఎక్కువగా సంబరాలు చేసుకోలేదు. “అసలు నాకు ఎలా సంబరాలు చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. మ్యాచ్ తర్వాత అవతలి జట్టు వికెట్ కీపర్​కు క్షమాపణ చెప్పా. ఎందుకంటే ఎదుటి జట్టు గోల్ పోస్ట్ నుంచి కీపర్ కొడితే గోల్ కావడం అతడికి బాధకలిగించి ఉంటుందని అనుకున్నా” అని కింగ్ చెప్పాడు.

Related posts