తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఈ నెల 22న స్థానిక సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు శనివారం ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు పోస్టల్ బ్యాలెట్ కోసం టీ- పోల్ సాఫ్ట్‌వేర్ ఫారం-12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఈసీ సూచించింది. ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని, ఇప్పటివరకు కేవలం 380 మంది మాత్రమే ఆన్‌లైన్‌లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. ఓటర్లు http://tsec. gov.in నుంచి స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎస్‌ఈసీ వెల్లడించింది.