telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

శ్రీకాళహస్తిలో ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థను గుర్తించిన నావికాదళం…

శ్రీకాళహస్తి పరిధిలో మేర్లపాక వద్ద పదిఎకరాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు కానుంది తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి. వెయ్యిమంది రోగులకు ఆక్సిజన్ పడకలతో వైద్యం అందించేలా జర్మన్ షెడ్ల ఏర్పాటుకు సమాలోచనలు చేస్తున్నారు అధికారులు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థను గుర్తించిన తూర్పు నావికాదళం… శ్రీకాళహస్తి పైప్స్ సంస్థలోని ప్రాక్స్ ఎయిర్ ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థను నావల్ డాక్ యార్డ్ బృందాలు సందర్శించాయి. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే ఆక్సిజన్ ను వైద్యఅవసరాల కోసం వినియోగించేలా… నిమిషానికి 16వేల లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసేలా ప్లాంట్ లో అత్యాధునిక సాంకేతికతను ఏర్పాటు చేస్తుంది నావల్ డాక్ యార్డ్. పరిశ్రమ నుంచి కిలోమీటర్ వరకూ పైప్ లైన్ లు ఏర్పాటుచేసి ఆక్సిజన్ ఇవ్వొచ్చని తూర్పునావికా దళం నివేదిక ఆధారంగా పరిశ్రమ సమీప ప్రాంతాల్లో తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాగం ప్రయత్నాలు చేస్తుంది. వెయ్యిపడకల తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి ఏర్పడితే తిరుపతి స్టేట్ కోవిడ్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది.

Related posts