నేషనల్ హెరల్డ్ కేసులో ఈడీ ముందుకు సోనియాగాంధీ
దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్
ఈడీ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు..
నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణకు గురువారం హాజరయ్యారు. ఆమె కుమార్తె ప్రియాంక గాంధీతో కలిసి ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితుల మేరకు సహకారిగా ఉండేందుకు ప్రియాంకకు.. ఈడీ అనుమతి ఇచ్చింది. అయితే విచారణ గది కాకుండా.. మరో గదిలో ఉండేందుకు ప్రియాంకకు అనుమతి ఇచ్చింది.
దేశ వ్యాప్త నిరసనలు..
సోనియా గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు ర్యాలీలు నిర్వహిస్తోంది . సోనియా గాంధీకి మద్దతుగా ఢిల్లీ, పాట్నా, లక్నో సహా దేశంలోని ఇతర నగరాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీలో కూడా కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
మరోవైపు పార్లమెంట్ లోపల, భయటన కూడా కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు.
మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కక్ష సాధిస్తోంది. ఈడీ ద్వారా ప్రతిపక్షాలపై ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది.
ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురి చేస్తోంది. భాజపా తీరును ఖండిస్తున్నాం. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సమష్టిగా పోరాటం చేస్తాయి.
Delhi | Congress interim president Sonia Gandhi, accompanied by her daughter Priyanka Gandhi Vadra, leaves her residence for the ED office #NationalHeraldCase pic.twitter.com/n2KqP2ZqTm
— ANI (@ANI) July 21, 2022
ఇదిలావుంటే..ఈడీ ఎదుట సోనియా గాంధీ హాజరుకావడానికి ముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం తన నివాసం నుంచి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఈ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు.